నిజామాబాద్ సౌత్: చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ నివాళి
నగరంలోని వినాయక్ నగర్ లోని విగ్రహాల పార్క్ వద్ద భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనలో దొరలు, భూస్వాములు, పెత్తందారులు బడుగు, బలహీన వర్గాల ప్రజలను వెట్టిచాకిరీ చేపిస్తు, బానిసలుగా చూస్తున్న రోజుల్లో చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం దున్నేవాడిదే భూమి అంటు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని గుర్తు చేశారు.