ఒంగోలు అర్బన్: భారీ దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు 37 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం
Ongole Urban, Prakasam | May 23, 2026
యాంకర్: ప్రకాశం జిల్లాలో సంచలనం రేపిన చీమకుర్తి భారీ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. వెంకటేశ్వర హార్డ్‌వేర్ దుకాణంలో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి వద్ద నుంచి 34 సవర్ల బంగారం, దాదాపు 2 కేజీల వెండి, రూ.5 లక్షల 95 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.37 లక్షల విలువైన సొత్తును రికవరీ చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. రూఫ్ టాప్‌ల ద్వారా దుకాణాల్లోకి ప్రవేశించి చోరీలకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడు ప్రసాద్‌పై ఇప్పటికే 13 కేసులు ఉన్నట్లు తెలిపారు. 100% చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు