నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో హనుమాన్ జయంతి పూజలను వీక్షించిన వానరం
Nandyal Urban, Nandyal | May 12, 2026
నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లె రైల్వే స్టేషన్ గ్రామంలోని మరకత లింగేశ్వర స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఆలయ వ్యవస్థాపకుడు కనమర్లపూడి మస్తాన్ రావు ఆధ్వర్యంలో ఆంజనేయస్వామికి అభిషేకాలు నిర్వహించి వడమాల సమర్పించారు. స్వామివారికి పూజ జరుగుతుండగా ఓ వానరం అక్కడికి చేరుకుని ఆసక్తిగా తిలకించడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.