రాప్తాడు: చిన్మయి నగర్ జేఎన్టీయూ ఓటిపిఆర్ఐ నందు మిషన్ హరిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో మొక్కలు నాటిన ఎన్ఎస్ఎస్ విద్యార్థినీలు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని జేఎన్టీయూ విశ్వవిద్యాలయం అనుబంధ ఓటిపిఆర్ఐ కళాశాల నందు శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఆచారి జీవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఓటీపిఆర్ఐ నందు ఆయుర్వేదిక్ మరియు వనమూలికలకు సంబంధించిన మొక్కలను నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఆచారి జీవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ హరితాంద్ర ప్రదేశ్ వనం మనం కార్యక్రమంలో భాగంగా 20 రకాల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎన్సిసి విద్యార్థుల ఆధ్వర్యంలో నాటడం జరిగిందని భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని ఓటిపిఆర్ఐ సంచాలకులు ఆచారి జీవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.