నంద్యాల అర్బన్: మిడుతూరు తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Apr 8, 2026
నంద్యాల జిల్లా మిడుతూరు తహసిల్దార్ కార్యాలయాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా రి సర్వే ప్రక్రియ పై సమీక్ష నిర్వహిస్తూ ఎన్ని గ్రామాలలో రీ సర్వే పూర్తయిందో తాసిల్దారును అడిగి తెలుసుకున్నారు. అలాగే పి జి ఆర్ ఎస్ ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని పరిశీలించి రికార్డులను సక్రమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు కార్యాలయ పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుతూ పరిశుభ్రతను పాటించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు