పట్టణంలో పింఛన్ పంపిణీ చేసిన ఎంపీ బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ
Dhone, Nandyal | May 1, 2025 డోన్ పట్టణంలోని తారకరామ్ నగర్ లో ఎంపీ బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ గురువారం పింఛన్ పింణీలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి నగదును అందజేశారు. లబ్ధిదారులతో మాట్లాడి ప్రతినెలా పింఛన్ సక్రమంగా అందుతోందా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారని చెప్పారు. అనంతరం పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు.