డోన్: డోన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి ట్రిపుల్ ఐటీలో సీటు
Dhone, Nandyal | Jun 14, 2026 డోన్ ఎన్.ఎన్. కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎస్. గౌతం కుమార్ ట్రిపుల్ ఐటీ ప్రవేశ ఫలితాల్లో శ్రీకాకుళం క్యాంపస్కు ఎంపికయ్యాడు. ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 574 మార్కులతో గౌతం పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచాడు. ప్రధానోపాధ్యాయులు డాక్టర్ సురేశ్ బాబు, ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందిస్తూ, అతని విజయం ఇతరులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.