ఒంగోలు అర్బన్: జూద క్రీడలు అక్రమ రవాణాలపై టాస్పరస్ పోలీసుల నిఘా. ఐదుగురు పేకాటరాయాలను అదుపులోకి తీసుకొని 1,37,740 నగదు స్వాధీనం
Ongole Urban, Prakasam | Jul 1, 2026
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక పోలీసు బృందాలు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ సీఐ కమలాకర్ ఆధ్వర్యంలో సిసిఎస్ ఎస్ఐ వెంకటేశ్వర్ రెడ్డి మరియు టాస్క్ ఫోర్స్ మరియు సిసిఎస్ సిబ్బంది దాడి కలసి పోకూరు గ్రామ పొలాల్లో అక్రమంగా కోతముక్క పేకాట ఆడుతున్న 5 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 సెల్ ఫోన్లు 2మోటర్ సైకిల్ RS 1,37,740/- నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని వీవీ పాలెం పోలీస్ స్టేషన్ లో అప్పగించారు