తిరుపతి జిల్లా నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని గురువారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐఇసి స్టాల్ ద్వారా వ్యాధి ఎలా వ్యాపిస్తుంది లక్షణాలను ఎలా గుర్తించడం చికిత్స పొందడం ఎంత ముఖ్యమో ప్రజలకు అధికారులు వివరించారు. నివారణ ఐ ఆర్ టి మందులు కండోమ్ వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ ఎస్పిజిసి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు.