జనగాం: జనగామలో దసరా వేడుకల వద్ద రాజకీయ రగడ: కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ
జనగామలో రావణవధ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం కారణంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గీయుల నిరసనలతో వేదిక వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు.