అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం గంగవరం గ్రామంలో మంగళవారం సాయంత్రం వైఎస్ఆర్సిపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం మూలంగా పేద విద్యార్థులకు వైద్య విద్య భారం అవుతుందని వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగిద్దామని కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి పిలుపునిచ్చారన్నారు. ఇందులో భాగంగానే గంగవరంలో కోటి సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని చేపట్టామని నాయకులు ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు.