ఒంగోలు అర్బన్: ప్రజల సంతృప్తే లక్ష్యంగా వారి అర్జీలను పరిష్కరించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 15, 2026
ప్రజల సంతృప్తే లక్ష్యంగా వారి అర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జాబాబు స్పష్టం చేశారు. సోమవారం ప్రకాశం భవనంలో నిర్వహించిన ' మీకోసం ' కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డిఆర్ఓ మాధురి, డిపిఓ వెంకటేశ్వరరావు, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ శాంతిలక్ష్మిలతో కలసి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 275 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల అర్జీలను సకాలంలో, సహేతుకంగా పరిష్కరించాలన్నారు. అర్జీలను పరిష్కరించలేని పక్షంలో అందుకుగల కారణాలను కూడా ప్రజలకు వివరించాలని చెప్పారు. తరచూ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని, పునరావృతం అవుతున్న