గాంధారి: చాకలి ఐలమ్మ ఉత్సవ కమిటీ కన్వీనర్ గా జువ్వాడి గ్రామ వాసి
గాంధారి : చాకలి ఐలమ్మ ఉత్సవ కమిటీ కన్వీనర్ గా కామారెడ్డి జిల్లా గాంధారి మండలం జువ్వాడి గ్రామానికి చెందిన శ్రీకాంత ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 26న హైదరాబాదులోని రవీంద్ర భారతిలో అధికారికంగా ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు నిర్వహించనుంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.