ఉరవకొండ: హావళిగి, పాల్తూరు గ్రామాల్లో రూ. 7.40 కోట్ల అంచనాతో త్రాగునీటి పైపులైను ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
అనంతపురం జిల్లా విడపనకల్లు మండల పరిధిలోని హవలిగి పాల్తూరు గ్రామాల్లో బుధవారం రూ.7.40 కోట్ల అంచనా తో వివిధ గ్రామాలకు సరఫరా చేసే నూతన తాగునీటి పైపులైన్లను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన పైప్ లైన్ మూలంగా మల్లాపురం కరకముక్కల చీకల గొక్కి ఉండబండ విడపనకల్ మరియు ఇతర గ్రామాలలో ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పించాలని ఉద్దేశంతో నూతన పైప్ లైన్ చేపట్టామన్నారు.