ఒంగోలు అర్బన్: ఒంగోలు డివిజన్లోని మద్దిపాడు పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్
Ongole Urban, Prakasam | Jun 29, 2026
ఒంగోలు డివిజన్లోని మద్దిపాడు వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా వేలం ప్రక్రియను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పొగాకు రైతుల సమస్యలను CM దృష్టికి తీసుకెళ్లామని, సీఎం స్వయంగా కొనుగోలు కంపెనీలతో సమావేశమై చర్చించారని తెలిపారు. రైతుల ప్రయోజనాలను కాపాడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.