నంద్యాల అర్బన్: బ్రాహ్మణులకు మందకృష్ణ మాదిగ వెంటనే క్షమాపణలు చెప్పాలి: నంద్యాలలో రాష్ట్ర బ్రాహ్మణ సమాఖ్య కార్యదర్శి సుధీర్
Nandyal Urban, Nandyal | Apr 10, 2026
MRPS జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బ్రాహ్మణులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర కార్య దర్శి నగరడోణ సుధీర్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెంకటరామరాజు హెచ్చరించారు. నంద్యాల ప్రథమ నంది దేవస్థానం ఆవరణలో శుక్రవారం మీడియా సమావేశం జరిగింది. మందకృష్ణ మాదిగ బ్రాహ్మణ కులాన్ని రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేయడాన్ని వారు ఖండించారు.