నందికోట్కూరు: ఏసీబీ వలలో ఎస్ఎస్ఏ ఏఈ రమేష్,40 వేలు లంచం తీసుకుంటుండగా అధికారుల మెరుపు దాడి,లంచం అడిగితేసమాచారమివ్వండి:ఏసీబీ డీఎస్పీ
నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఏసీబీ అధికారుల మెరుపు దాడితో అధికారులు ఉలిక్కిపడ్డారు. సర్వ శిక్ష అభియాన్ అసిస్టెంట్ ఇంజనీర్ తెలుగు రమేష్ 40 వేలు లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీ అధికారులకు చిక్కారు. వివరాల్లోకి వెళ్తే మిడుతూరు, జూపాడుబంగ్లా మండల కేంద్రాల్లో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల భవనాలను కాంట్రాక్టర్ తెలుగు శ్రీనివాసులు నిర్మిస్తున్నారు.బిల్లులు మంజూరు కావాలంటే ఈ భవనాలు నాణ్యతగా ఉన్నాయని దృవీకరణ పత్రం ఇవ్వడానికి ఏఈ లంచం డిమాండ్ చేశాడు.శనివారం బ్రాహ్మణకొట్కూరు నేషనల్ హైవే రోడ్డు సింహాద్రి కోల్డ్ స్టోరేజ్ వద్ద కారులో కాంట్రాక్టర్ శ్రీనివాసులు వద్ద నుండి ఏఈ రమేష్ 40 వేల రూ