కనిగిరి: దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు దివ్యాంగుల సంక్షేమానికి 7 వరాలను ప్రకటించడం అర్షనీయమని దివ్యాంగుల హక్కుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులు గురువారం కనిగిరి పట్టణంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర దివ్యాంగుల హక్కుల ఐక్యవేదిక అధ్యక్షులు దూళిపాళ్ల మల్లికార్జున మాట్లాడుతూ.... దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, స్థానిక సంస్థల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియామకం, రుణాలు, గ్రౌండ్ ఫ్లోర్లో దివ్యాంగులకు నివాసాలు, దివ్యాంగులకు క్రీడలు, అమరావతిలో దివ్యాంగుల భవన్ నిర్మిస్తామని సీఎం చెప్పడం హర్షనీయమన్నారు.