ఉరవకొండ: బెళుగుప్పలో పోటాపోటీగా స్కూల్ గేమ్స్ డివిజనల్ స్థాయి వాలీబాల్ పోటీలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారంఉదయం నుండి సాయంత్రం వరకు డివిజనల్ స్థాయి వాలీబాల్ పోటీలు పోటాపోటీగా జరిగాయి. స్పోర్ట్స్ డివిజనల్ కోఆర్డినేటర్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలకులు ఈశ్వర్ రెడ్డి పిడి ప్రభాకర్లతో కలిసి నిర్వహించిన పోటీల్లో ముఖ్య అతిథులుగా గుత్తి డివైఈఓ మల్లారెడ్డి టిడిపి జిల్లా కార్యదర్శి మల్లికార్జున నాయకులు పెద్ద తిప్పయ్య పాఠశాల కమిటీ చైర్మన్ రుద్ర, ఎంఈఓ 2 హరికృష్ణ హెచ్ఎం వెంకట ప్రసాద్ లుపాల్గొని పోటీలను ప్రారంభించారు. పోటీల్లో బాల బాలికల విభాగంలో బెళుగుప్ప, శెట్టూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు.