గుంతకల్లు: పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం పట్టణంలోని ట్రావెలర్స్ బంగ్లా ఎదురుగా ఉన్న మౌలానా అబుల్ కలాం అజాద్ విగ్రహానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీఆర్.ఖలీల్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం అజాద్ అలియా బేగం, ఖైరుద్దీన్ అహ్మద్ దంపతులకు 1888 నవంబరు 11న మక్కాలో జన్మించారని అన్నారు. స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అన్నారు.