కోడుమూరు: గూడూరులో కుష్టు వ్యాధి సర్వేపై వైద్య సిబ్బందికి అవగాహన సమావేశం
గూడూరులో మంగళవారం వైద్య సిబ్బందికి కుష్టు వ్యాధి సర్వేపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డాక్టర్ షఫియా, శాంతకుమారి మాట్లాడుతూ కుష్టు వ్యాధి మైకో బ్యాక్టీరియ లేప్రే అనే బ్యాక్టీరియా వలన వస్తుందన్నారు. వ్యాధి లక్షణాలను తెలియజేశారు. ఈనెల 17 నుంచి నెలాఖరు వరకు కుష్టు వ్యాధి సర్వే పకడ్బందీగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు.