ఒంగోలు అర్బన్: రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి సమానంగా సాగుతున్నాయి అన్న ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ
Ongole Urban, Prakasam | Jun 5, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో శుక్రవారం ఏపీ మారీ టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు సమానంగా సాగుతున్నాయని గత ప్రభుత్వం రాష్ట్రానికి 10 లక్షలు కోట్లు అప్పు మిగిలిస్తే ప్రస్తుతం సీఎం చంద్రబాబు అభివృద్ధి వైపు తీసుకు వెళ్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరినట్లు తెలిపారు. మారీ టైం బోర్డు ద్వారా రాష్ట్రానికి కోట్లల్లో పెట్టుబడులు వచ్చినట్లు దామచర్ల సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు.