ఇబ్రహీంపట్నం: రూ. 30 లక్షల విలువ చేసే గంజాయిని పట్టుకున్న రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు... వివరాలు తెలిపిన డీసీపీ కోటిరెడ్డి
షేక్ బషీరాబాద్ లోని డీసీపీ కార్యాలయంలో డీసీపీ కోటిరెడ్డి శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా గంజాయి తరలిస్తున్నారు అన్న పక్క సమాచారంతో గంజాయి ముఠా ను రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారని అన్నారు. వారి నుంచి 30 లక్షల రూపాయల విలువచేసే 86 కేజీల గంజిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఇద్దరినీ అరెస్టు చేశామని ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు.