అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం మద్దెలవాండ్లపల్లి గ్రామానికి చెందిన గున్నికుంట్ల శిరీష (35) కువైట్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. జీవనోపాధి కోసం ఏడాది క్రితం కువైట్‌కి వెళ్లిన శిరీష, జహర ప్రాంతంలోని ఓ ఇంటిలో పనిమనిషిగా పనిచేస్తోంది.ఈనెల 10 అర్ధరాత్రి సమయంలో శిరీష గ్యాస్ పేలుడు కారణంగా లేదా ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని కువైట్‌లో ఉన్న బంధువుల ద్వారా ఆమె భర్త మల్లికార్జునకు సమాచారం అందింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు దీనిపై తీవ్ర అనుమానం వ్యక్తం చేస్తున్నారు.తన భార్య ఆత్మహత్య చేసుకునే పరిస్థితే లేదని, కువైట్‌లో యజమానులు కొట్టి చంపి ఆత్మహత్యగా చూపిస్తున్నారని మల్