బనగానపల్లె: డైవర్షన్ పాలిటిక్స్ తో కూటమి ప్రభుత్వం :బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని
డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కూటమి ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. మంగళవారం బనగానపల్లెలో 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమంలో భాగంగా చర్చా వేదిక నిర్వహించారు. అనంతరం ఆర్ట్ గ్యాలరీ ప్రదర్శించి, నల్ల బెలూన్లు వదిలి వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అత్తర్ జావిద్, హుసేన్, గుండం నాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు.