నందికోట్కూరు: పారిశుద్ధ్యం పై నిర్లక్ష్యం వద్దు, నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రామిరెడ్డి
నంద్యాల జిల్లా నందికొట్కూరు పారిశుధ్యం పై నిర్లక్ష్యం వహించవద్దని నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రామిరెడ్డి సిబ్బందిని ఆదేశించారు, సోమవారం ఉదయం సంగాయపేట పగిడ్యాల రోడ్డు బైరెడ్డి నగర్ ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు, మంచి నీటి సరఫరా వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ తీరును స్థానికులు అడిగి తెలుసుకున్నారు, ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించాలని పారిశుధ్యం పై నిర్లక్ష్యం వహించకూడదని సిబ్బందిని ఆదేశించారు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ సిబ్బందిని సూచించారు, ఈ మున్సిపల్ ఏఈ దినేష్ కుమార్ రెడ్డి ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు