ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల కేంద్రంలో 4.9 కోట్ల రూపాయలతో సుందరీకరణ తో అభివృద్ధి చేసిన ఎల్కతుర్తి జంక్షన్ ను రాష్ట్ర రవాణా బీసీ సంక్ష
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో 4.9 కోట్ల రూపాయలతో సుందరీకరణ తో అభివృద్ధి చేసిన ఎల్కతుర్తి జంక్షన్ ను రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం ఎల్కతుర్తి వై జంక్షన్ లో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ, సిద్దిపేట జిల్లాల కలెక్టర్ లు స్నేహ శబరీష్, హైమవతి, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, జిడబ్ల్యుఎంసి కమిషనర్ చాహత్ వాజ్ పేయి, సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, హనుమకొండ రెవిన్యూ డివిజనల్ అధికారి రమేష్ రాథోడ్, ఇతర సంబంధిత అధికారులు పాల్గోన్నారు.