గాజుల పల్లెలో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
Nandyal Urban, Nandyal | Apr 1, 2026
నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లెలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. నరసింహ బృందం వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడి కళ్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించారు. స్వామి, అమ్మవార్లను సుందరంగా అలంకరించి దర్శనం కల్పించారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.