నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న వజ్రాల వేట
Nandyal Urban, Nandyal | Jul 5, 2026
'అదృష్టం వరించి.. వజ్రం దొరికి.. అప్పులు తీరేనా' అనే ఆశతో ప్రజలు ఎర్రవంకలో వజ్రాల వేట సాగిస్తున్నారు. ఇటీవల స్వల్ప వర్షాలు కురవడంతో ఆదివారం పలు ప్రాంతాల నుంచి ప్రజల తండోపతండాలుగా తరలివస్తున్నారు. మహానంది మండలం గాజులపల్లి సమీపంలోని సర్వ నరసింహస్వామి ఆలయం వద్ద వంకలో వజ్రాల కోసం గుంటూరు, విజయవాడ ప్రాంతాల నుంచి సైతం వస్తున్నారు. వజ్రాలు దొరుకుతున్నాయని సోషల్ మీడియాలో చూసి ఇక్కడికి వస్తున్నట్లు వారు తెలుపుతున్నారు