ఖైరతాబాద్: తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిసిన మెడికల్ విద్యార్థులు
తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్‌తో మెడికల్ విద్యార్థులు, తల్లిదండ్రులు భేటీ అయ్యారు. మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలలో అర్హత సాధించినప్పటికీ, ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త స్థానికత జీవో కారణంగా ప్రవేశాలకు అనర్హులుగా మిగిలిపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కేటీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఫోన్లో మాట్లాడి సమస్యను సానుకూలంగా పరిశీలించాలని కోరారు.