బోయిన్‌పల్లి: వరదవెల్లిలో అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న కారు ఇరువురికి తీవ్ర గాయాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండలం,వరద వెళ్లి గ్రామ శివారులో కారు ఆదివారం 9:50 PM కి అదుపు తప్పి కల్వర్టును ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది, కరీంనగర్ నుండి కారులో రవీందర్ కుటుంబానికి చెందిన నలుగురు సిరిసిల్ల కి ఫంక్షన్ కి వేగంగా వెళ్తున్న క్రమoలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించుకునే క్రమంలో వేగంగా వెళ్తూ పక్కనున్న కల్వర్టును ఢీ కొట్టాడు,దీంతో కార్లో ఉన్న డ్రైవర్ తో పాటు మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి,మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయట పడ్డారు,స్థానికుల సహాయంతో గాయాలైన వారిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు,ఇంకా ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది,