నిడదవోలు నియోజకవర్గంలో మొదలైన పదో తరగతి పరీక్షలు, 19 పరీక్షా కేంద్రాలలో అని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
నిడదవోలు పట్టణంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే పదవ తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు విద్యా శాఖ అధికారులు పూర్తి చేశారు. ఈ పదవ తరగతి పరీక్షలు సోమవారం నుండి 30వ తేదీ వరకు జరుగనున్నాయి. ఉదయం 9:30 కు నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి ఒక గంట ముందు వెళ్లాలని అధికారులు సూచించారు. నిడదవోలు మండలంలో తొమ్మిది పరీక్ష కేంద్రాలకు గాను 1814 విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.