చిన్న జనాలపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | Apr 21, 2026
అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజనం ఆసుపత్రిలోని అత్యవసర వైద్య విభాగంలో చిన్న జలాలపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చక్రాయపేటకు చెందిన శర్మాస్ వలి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.