ఊర్కొండ: ఊరుకొండ మండల పరిధిలోని రేవెల్లి గేటు దగ్గర లారీని ఢీ కొట్టిన బైకు ఇద్దరు మృతి
మహబూబ్నగర్ జిల్లా ఊరుకొండ మండలంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రేవల్లి గేటు సమీపంలో లారీని బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. యూపీకి చెందిన ఇద్దరు యువకులు మిడ్జిల్ మండల కేంద్రంలో ఉంటూ పాల్ సీలింగ్ వర్క్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి బైక్పై కల్వకుర్తి నుంచి మిడ్జిల్ వైపు వెళ్తూ రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.