ఇచ్చోడ: ఇచ్చోడ మండల కేంద్రంలోని బైపాస్ పై గుర్తుతెలియని వాహనం ఢీకొని మతిస్థిమితం లేని మహిళ మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన ఇచ్చోడ మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన విరాల ప్రకారం నిర్మల్ బైపాస్ వద్ద మతిస్థితం లేని ఓ మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టమని, మృతదేహాన్ని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని మార్చురీ గదిలో భద్రపరచినట్లు పోలీసులు తెలిపారు. మహిళ వివరాలు తెలిసినవారు సిఐ బీమేష్ ఫోన్ నంబర్ 8712659936 సంప్రదించాలని సూచించారు