అనంతపురం అర్బన్: రాచానపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న మరో ద్విచక్ర వాహనం వృద్ధుడికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 16, 2026
అనంతపురం నగర శివారులోని రూరల్ మండల పరిధిలో ఉన్న రాచానపల్లి వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని మరో ద్విచక్ర వాహనదారుడు వేగంగా ఢీకొన్న ఘటనలో వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఊదిరిపికొండ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతనిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.