బనగానపల్లె: కూటమి ఐక్యతతోనే రాష్ట్ర అభివృద్ధి :మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి
రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఐక్యతతోనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి సాధిస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిర పేర్కొన్నారు. శుక్రవారం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోయ భాస్కర్ తండ్రి కృష్ణమూర్తిని ఆమె పరామర్శించారు. ఇటీవలే కృష్ణమూర్తి ప్రమాదవశాత్తు కిందపడి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్నారు. దీంతో భాస్కర్ కుటుంబాన్ని ఇందిర పరామర్శించారు.