కోడుమూరు: పెంచికలపాడు సిసిఐ కేంద్రం వద్ద పత్తి రైతుల సమస్యలు పరిష్కరించిన ఎంపీ బస్తి పాటి నాగరాజు
గూడూరు మండలంలోని పెంచికలపాడు వద్ద సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతుల ఇబ్బందులను ఎంపీ బస్తిపాటి నాగరాజు పరిష్కరించారు. నిబంధన మేరకు స్లాట్ బుక్ చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం పత్తి విక్రయానికి తీసుకురాగా, అధికారులు తమకు వివరాలు లేవంటూ తెలిపారు. దీంతో రైతులు రహదారిపై కూర్చుని నిరసనకు దిగారు. అటుగా వెళుతున్న ఎంపీ స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి రైతుల సమస్యలు తీసుకెళ్లారు. స్లాట్ బుక్ అయ్యి మెసేజ్లు వచ్చిన రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయాలని ఆదేశించారు.