ఆళ్లగడ్డ: కృష్ణాపురం సమీపంలోని పంట పొలాల్లో విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామ సమీప పొలాల్లో విద్యుస్తంబాలు విరిగిపడ్డాయి, ఇటీవల కురిసిన వర్షానికి కృష్ణాపురం కోటకందుకూరు గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రహదారి పక్కన పంట పొలాల్లో ఘటన జరిగింది, దీంతో విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు, విద్యుత్ అధికారులు స్పందించి విరిగిపడిన స్తంభాలను సరి చేయాలని రైతులు కోరుతున్నారు