ఎమ్మిగనూరు: ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మిగనూరులోని సోమప్ప సర్కిల్ లో మానవహారం నిర్వహించి నిరసన..
ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మిగనూరులోని సోమప్ప సర్కిల్ వద్ద మంగళవారం విద్యార్థులు మానవహారం ఏర్పడి ఆందోళన చేపట్టారు. అనంతరం వారు తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ ఆందోళనలో విద్యార్థి, ప్రజా సంఘాలతో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన, వైసీపీ, సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు పాల్గొన్నారు. ఆదోని జిల్లా అయితేనే పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నేతలు పేర్కొన్నారు.