ఆళ్లగడ్డ: ఉయ్యాలవాడ మండలం ఉండునదిలో నిలిచిన నీటి ప్రవాహం వరి పంట సాగు ప్రశ్నార్థకం
నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండల పరిధిలోని కుందూ నదిలో నీటి ప్రవాహం నిలిచిపోయింది, ఉయ్యాలవాడ మండలంలోని 21 గ్రామాలు ఉండగా 16 గ్రామాలు కుందునది నీటి ప్రవాహం ఆధారంగానే వరి పంట సాగు చేస్తున్నారు, ప్రతి ఏడాది ఉయ్యాలవాడ మండలంలో వెయ్యి హెక్టార్లలో వరి పంట సాగు అయ్యేది, కానీ ఈ ఏడాది ఇప్పటివరకు రైతులు వరి పంట సాగు చేయలేదు, దీంతో ఉయ్యాలవాడ మండలంలో వరి పంట సాగు ప్రశ్నార్థకంగా మారింది