డోన్: డోన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఐదు మందికి శిక్ష
Dhone, Nandyal | Jul 14, 2026 డ్రంకెన్ డ్రైవ్ కేసులలో డోన్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూరుల్లా ఐదుగురికి జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. గోనెల మాదిగ ప్రకాశం, కుమ్మరి ఆనంద్, బోయ ఆనంద్, షేక్ రఫిక్కు జైలు శిక్ష, షేక్ మహబూబ్ బాషాకు రూ.10 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రమాదాలు జరిగితే కుటుంబాలు నాశనం అవుతాయని, జాగ్రత్తగా ఉండాలని అన్నారు.