బోయిన్‌పల్లి: తడగొండ గ్రామ శివారులో ఆటో ద్విచక్ర వాహనం ఢీకొని రోడ్డుప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండలం,తడగొండ గ్రామ శివారులో ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటన శుక్రవారం రాత్రి 9 గంటల పది నిమిషాలకు చోటు చేసుకుంది,నలుగురు ప్యాసింజర్లతో కూడిన ఆటో బోయిన్పల్లి నుండి గంగాధర కు వస్తూ ఉండగా, వేములవాడకు చెందిన పరశురాం గంగాధర నుండి వేములవాడకు వెళ్తుండగా తడగొండ గ్రామ శివారులో ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీ కొట్టింది,దీంతో ద్విచక్ర వాహనదారుడు కు తీవ్ర గాయాలయ్యాయి, అదే ఆటోలో స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం పరశురాంను కరీంనగర్ ఆస్పత్రి తరలించారు,ఇంకా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,