ఒంగోలు అర్బన్: ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన వికాసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న 20 సూత్రాల కమిటీ చైర్మన్ దినకర్
Ongole Urban, Prakasam | Jun 9, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన వికాసిత్ భారత్ స్వర్ణాంధ్ర కార్యక్రమంలో 20 సూత్రాల కమిటీ చైర్మన్ దినకర్ పాల్గొన్నారు. జిల్లాలో అభివృద్ధి పనులపై కలెక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో దినకర్ సమీక్ష జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని అధికారులకు కూడా అందుకు సహకరించి అభివృద్ధికి సహకరించాలని దినకర్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అలానే జిల్లాలో అభివృద్ధి పనులు ప్రస్తుతం పెండింగ్లో ఉన్న పనులు అంశాలపై అధికారులతో చర్చించారు.