సంగారెడ్డి: తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో చైతన్యపురి కాలనీ పార్కులో స్వచ్ఛత ఉత్సవ్, స్వచ్ఛత ఈ సేవ
సంగారెడ్డి పట్టణంలోని చైతన్యపురి కాలనీ పార్కులో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సంగారెడ్డి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో చైతన్యపురి కాలనీ పార్కులో స్వచ్ఛత ఉత్సవ్ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా శ్రమదానం నిర్వహించినట్లు రీజినల్ మేనేజర్ పేర్కొన్నారు. ఏ గంట ఏక్ సాత్ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల బ్యాంక్ ఉద్యోగులు వర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ సమత, చీఫ్ మేనేజర్ హబీబుల్లా, సీనియర్ మేనేజర్ రామకృష్ణ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.