డోన్: డోన్ లో చెరువులా మారిన డ్రైనే్జీ నీరు
Dhone, Nandyal | May 23, 2026 నంద్యాల జిల్లాడోన్ అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో డ్రైనేజీ నీరు పెద్ద ఎత్తున నిల్వ కావడంతో స్థానికులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న వర్షం కురిసినా చెరువులా మారుతోందని, ఆలయానికి వెళ్లే భక్తులు, కాలనీవాసులు దుర్వాసనతో అవస్థలు పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతిసారి వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఏర్పడుతోందని, అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.