అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని గంగవరం గ్రామంలో శుక్రవారం సాయంత్రం వైయస్సార్సీపి మండల నాయకులు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైయస్సార్సీపి బెలుగుప్ప మండల కన్వీనర్ మచ్చన్న జడ్పిటిసి త్రిలోక్ రెడ్డి పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీరన్నల ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తే పేద విద్యార్థులకు వైద్య విద్య భారంగా మారుతుందని పేర్కొన్నారు. అనంతరం వైఎస్ఆర్సిపి పార్టీ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు.