ఒంగోలు అర్బన్: కులాన్ని బట్టి కాదు అర్హతను బట్టి ఉద్యోగం వస్తుంది: ఎలక్ట్రికల్ డి ఈ హరిబాబు
Ongole Urban, Prakasam | Apr 4, 2026
కులాన్ని బట్టి ఉద్యోగం రాదని అర్హతను బట్టి ఉద్యోగం వస్తుందని దాని ఆధారంగానే ఉద్యోగం చేయడం జరుగుతుందని ఒంగోలు ఎలక్ట్రికల్ డి ఈ మాకినేని హరిబాబు మీడియాకు తెలియజేశారు. శనివారం విద్యుత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యుత్ అధికారులతో కలిసి డిఇ మాట్లాడుతూ ఇద్దరు అధికారుల మధ్య జరుగుతున్న సాధారణ చర్చ్ ను కులాలకు అంటగట్టే రాజకీయాలు చేయాలని చూడటం సరికాదన్నారు. ఎవరికైనా అర్హత ఉంటే ఉద్యోగం వస్తుంది తప్ప కులం ఆధారంగా ఉద్యోగం రాదన్నారు. కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించడం జరుగుతుందని ఆ ఉద్యోగంలో రాణించేందుకు కష్టపడడం జరుగుతుందన్నారు