యలమంచిలిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు, సోమవారం యలమంచిలి పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని 23 మంది లబ్ధిదారులకు 15 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.