డోన్: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి :బేతంచెర్ల CI వెంకటేశ్వరరావు
Dhone, Nandyal | Jun 26, 2026 యువత చెడు వ్యసనాలకు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని బేతంచెర్ల సీఐ వెంకటేశ్వరరావు సూచించారు. 'నిషా ముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. గంజాయి, మత్తుపదార్థాల వల్ల ఆరోగ్యం, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. యువత చెడు అలవాట్లను వీడి, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలన్నారు